గంగవ్వ..మళ్లీ పాత పాటే!

133
gangavva

బిగ్ బాస్‌ 4లో స్టార్‌గా ఉన్న గంగవ్వ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. హౌస్‌మేట్స్‌ అంతా అవ్వ అని గంగవ్వను బాగా చూసుకుంటుండగా గంగవ్వ మళ్లీ పాతపాటే అందుకుంది. హౌస్‌లోకి ఎంటరైన రెండవ వారంలోనే తాను ఇంటికి పోతానని కంటతడి పెట్టిన గంగవ్వ…తాజాగా ఐదోవారంలో మళ్లీ తాను ఇంటికి పోతానని చెప్పుకొచ్చింది.

బీబీ హోటల్,కెప్టెన్సీ టాస్క్ ముగిసిన అనంతరం బాధపడుతున్న అఖిల్‌ని ఓదార్చే ప్రయత్నం చేసింది గంగవ్వ. బాధపడొద్దని అఖిల్‌కి సూచించింది గంగవ్వ. అయితే తన బాధను కవర్ చేసిన అఖిల్..గంగవ్వతో కాసేపు ముచ్చటించారు.

ఇంటికి తాళం వేసి వచ్చావా అని గంగవ్వను అడగగా తాళం లేదు సుత్తిల్ దారంతో కట్టడమే అని తెలిపింది. ఇంటి సంగతి ఏమోగాని ఇక్కడ ఉండలేనని ఇది చిన్నదని అక్కడైతే ఊరంతా తిరిగి అందరితో ముచ్చటించొచ్చని తాను ఇంటికి పోతానని తెలిపింది. అన్నం పోత‌లేదు మొదట్లో చాలా తినేదాన్ని కానీ ఇప్పుడు కొంచమే తింటున్నానని ఇంటికి పోతా అని అఖిల్‌తో త‌న బాధ తెలిపింది గంగవ్వ.