బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 75 హైలైట్స్

26
episode 75

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 75 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 75వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యుల ఎమోషన్‌ రెండో రోజు క్యారీ అయింది. రెండో రోజు అరియానా ఫ్రెండ్,మోనాల్ సిస్టర్‌,సొహైల్ తండ్రి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరితో మాట్లాడి జోష్ నింపారు.

తొలుత తన అమ్మ గురించి మోనాల్‌కి చెబుతూ ఎమోషన్ అయ్యారు అఖిల్. అమ్మ మొద‌టిసారి తనకు ఐ ల‌వ్ యూ చెప్పింద‌ని..త‌న పేరును ప‌చ్చ‌బొట్టు పొడిపించుకుంద‌ని తెలిపాడు. తర్వాత సోహైల్ …అవినాష్‌తో ఆడుకున్నాడు. కానీ అవినాష్ మాత్రం ఏ అవ‌కాశం దొరికినా వ‌దిలి పెట్ట‌కుండా మోనాల్ ద‌గ్గ‌ర పాట‌లు పాడుతూ పులిహోర క‌లిపాడు.

తర్వాత అరియానా స్నేహితుడు విన‌య్ హౌస్‌లోకి వ‌చ్చాడు. అత‌న్ని చూడ‌గానే అరియానా గుక్క‌పెట్టి ఏడ్చేసింది. విన‌య్ వేరేవాళ్ల‌ను ప‌ల‌క‌రిస్తే కూడా తట్టుకోలేకపోయింది. త‌న‌తోనే మాట్లాడ‌మ‌ని అరిచి గోలగోల చేసింది. త‌న‌కు బ‌ట్ట‌లు, చెప్పులు పంపించ‌మంటూ వినయ్‌తో చెప్పింది. వినయ్‌తో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయింది అరియానా.

ఇక మోనాల్ వంతు రాగా అమ్మ వాయిస్ వినిపించారు. మోనాల్ పాపా ఎలా ఉన్నావు, నువ్వు చాలా గుర్తొస్తున్నావు. హైద‌రాబాద్‌కు రాలేక‌పోయాము అని చెప్పింది. దీంతో మోనాల్ కాసేపు కంటతడి పెడుతూనే ఉంది. నా ఎమోష‌న్స్‌తో ఆడుకోకు బిగ్‌బాస్‌.. నాకు కోపం వ‌స్తుంది వార్నింగ్ కూడా ఇచ్చింది. కాసేపు గ్యాప్ తర్వాత మోనాల్ సిస్టర్‌ హౌస్‌లోకి ఎంటరైంది. దీంతో కంటతడి పెట్టుకుంటూ అందరి గురించి అడిగి తెలుసుకుంది మోనాల్. ముఖ్యంగా అఖిల్-తన గురించి బయట ఏమనుకుంటున్నారో చెప్పాలని కోరింది. ఇక సొహైల్‌ను నువ్వంటే ఇష్టమని తెలిపిన మోనాల్ సోదరి..అవినాష్‌ను అంద‌రితో పులిహోర క‌లిపేయ‌డ‌మే నీ ప‌నా అని కౌంట‌ర్ ఇచ్చింది. ఏదైనా మాట్లాడేది ఉంటే ముందే మాట్లాడ‌మ‌ని అభిజిత్‌కు స‌ల‌హా ఇచ్చింది. మోనాల్ సోద‌రి చెప్పిన మాట‌ల‌కు అభి హ‌ర్ట్ అయ్యాడు.

ఇక చివరగా సోహైల్ తండ్రి స‌లీమ్‌ ఎంట్రీ ఇవ్వగా సింగ‌రేణి ఒక్క‌టే కాదు. ప‌ల్లె గిల్లా అంతా మ‌న‌దే, బ‌య‌ట క‌థ వేరే ఉంద‌ని గ‌ర్వంగా చెప్పుకొచ్చాడు. వీడు మా తాత‌లాగే ఉంటాడ‌ని, అందుకే సోహైల్‌ను తాత అని పిలుస్తామ‌ని తెలిపాడు. ఒక‌రిపై ఒక‌రు ముద్దులు కురిపించుకున్న త‌ర్వాత‌ జై సింగ‌రేణి నినాదాల‌తో ఆయ‌న‌కు అంద‌రూ వీడ్కోలు తెలిపారు.