బిగ్ బాస్ …ఎపిసోడ్ 33 హైలైట్స్‌

100
episode 33

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 33 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. 33వ ఎపిసోడ్‌లో బీబీ హోటల్ టాస్క్ ముగియడం,హోటల్ గెస్ట్‌లు గెలవడం, కెప్టెన్‌గా సొహైల్ ఎన్నికవడం,గంగవ్వ మళ్లీ ఇంటికి పోతాను అనడం ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది.

గెస్ట్‌ల టీంలో ఉన్న హారిక…అభిజిత్‌తో కలిసి ఆటాడి తన దగ్గర ఉన్న స్టార్స్ అన్ని త్యాగం చేసింది. తర్వాత రియలైజ్ అయిన హారిక గెస్ట్ టీంలో ఉన్న వారికి సమాధానం చెప్పాల్సి వస్తుందని తెలిసి కన్నీటి పర్యంతం అయింది. తాను కేవలం ఒక స్టార్ మాత్రమే ఇచ్చానని ఐదు స్టార్స్ ఇవ్వలేదని బిగ్ బాస్ కెమెరా ముందు తెలిపింది.

అయితే అభిజిత్ మాత్రం హారిక వాదనతో వ్యతిరేకించారు. ఇష్టపూర్వకంగా స్టార్స్ ఇవ్వాల్సిన అవరసం లేదని వాదనకు దిగాడు. టాస్క్ ముగిసిన అనంతరం హోటల్ టీం గెస్ట్ టీం ద్వారా ఎన్ని స్టార్స్ పొందారో చెప్పాలని బిగ్ బాస్ అడగడంతో.. ఫైవ్ స్టార్స్ అంటూ సమాధానం ఇచ్చాడు అభిజిత్. అయితే మేం ఇవ్వలేదు బిగ్ బాస్ అని వాదనకు దిగారు హారిక, గెస్ట్ టీం.

కొంతసేపు వాదన జరిగిన అనంతరం బిగ్ బాస్ హోటల్ టీంకి జలక్ ఇస్తూ.. గెస్ట్ టీం గెలిచినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో గెస్ట్ టీంని అభినందించిన హోటల్ టీం సభ్యులు ఒకరికొకరు అప్రిసేట్ చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో అప్పటివరకు కంటతడి పెట్టిన హారిక…అభిజిత్‌ని గట్టిగా కౌగిలించుకుని అలాగే ఉండిపోయింది. ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులు వీళ్ల విన్యాసాలు చూసి షాక్ అయ్యారు.

హోటల్ టాస్క్‌లో గెస్ట్ టీం విజేతగా నిలవడంతో ఆ టీంలో బెస్ట్ పెర్ఫామర్ ఎవరో చెప్పాలని బిగ్ బాస్ అడగ్గా కొంతసేపు వాదన అనంతరం అంతా కలిసి సొహైల్‌ని ఎన్నుకున్నారు. దీంతో కెప్టెన్ రేసులో ఉన్న ఫస్ట్ కంటెస్టెంట్ సొహైల్ అని ప్రకటించారు బిగ్ బాస్. తర్వాత టిప్ ఎక్కువగా ఉన్న అఖిల్‌ని, సీక్రెట్ టాస్క్‌ని సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్ చేసిన అవినాష్ కెప్టెన్ రేసులో ఉన్నట్లు ప్రకటించారు బిగ్ బాస్‌.ఇక హోటల్ టాస్క్‌లో వరస్ట్ పెర్ఫామర్‌గా రాజశేఖర్ మాస్టర్‌ నిలవగా ఉల్లిపాయలు కట్ చేసి స్టోర్ రూంలో పెట్టాలని శిక్ష విధించారు.

కెప్టెన్ టాస్క్‌లో భాగంగా మంచి నిప్పు.. మధ్యలో ఓర్పు టాస్క్ ఇచ్చారు. కింద నిప్పుల మంట పెట్టి.. చేతిల్లో ఐస్ బౌల్స్ పెట్టి ఒంగూనే ఉండాలని ఎక్కువ సేపు చేతిల్లో ఐస్ ముక్కులు పెట్టుకునే ఉండాలని ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్లే విజేతలని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.ఈ టాస్క్‌కు అభిని సంచాలకుడిగా పెట్టారు బిగ్ బాస్. అవినాష్,సొహైల్,అఖిల్ ముగ్గురు హోరాహోరిగా తలపడ్డారు. అఖిల్ అతి కష్టం మీద మధ్యలోనే డ్రాప్ కాగా అవినాష్ చివరి వరకు పోరాడి విఫలం అయ్యారు. దీంతో కెప్టెన్‌గా సొహైల్ ఎన్నికైనట్లు ప్రకటించారు బిగ్ బాస్‌.