మెగాస్టార్‌ని కలిసిన సొహైల్…

241
sohail
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. విన్నర్‌గా అభిజిత్ నిలవగా మూడో స్ధానంలో నిలిచారు సొహైల్. ఇక సొహైల్ రూ. 25 లక్షల ప్రైజ్‌మనీతో బయటకు రాగా మెగాస్టార్ చిరంజీవి,కమెడియన్ బ్రహ్మానందం …సోహెల్‌ తీయబోయే సినిమాలో నటిస్తామని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.

రెండు రోజుల క్రితం నాగార్జునను కలిసిన సొహైల్ ఇవాళ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. చిరు ఇంటికి వెళ్లిన సొహైల్ దాదాపు రెండు గంటల పాటు అక్కడ గడిపాడు. మెగాస్టార్‌తోపాటు ఆయన భార్య సురేఖ, తల్లి అంజనా దేవితో కలిసి ఫొటోలు దిగగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సొహైల్ త‌న డెబ్యూ చిత్రాన్ని జార్జిరెడ్డి, ప్రెష‌ర్ కుక్క‌ర్ నిర్మాత‌లు అప్పిరెడ్డితో క‌లిసి చేయ‌నుండగా, ఈ చిత్రాన్ని శ్రీనివాస్ వింజనంపతి తెర‌కెక్కించనున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్ర టైటిల్‌తో పాటు క్రూ అండ్ క్యాస్ట్ ప్ర‌క‌టించ‌నున్నారు.

- Advertisement -