బిగ్ బాస్ 4…ఎలిమినేషన్‌లో దేవి

176
devi

బిగ్ బాస్ 4 తెలుగు సక్సెస్‌ ఫుల్‌గా రెండు వారాలను పూర్తిచేసుకుంది. తొలివారంలో ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా ఇందులో నుండి సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యారు. ఇక రెండోవారంలో 9 మంది ఎలిమినేషన్‌కు నామినేట్ ఇద్దరు ఇంటి నుండి బయటికి వెళ్లనున్నారని ప్రకటించిన నాగ్‌..కరాటే కల్యాణి ఒకరినే ఎలిమినేట్ చేశారు.

ఇక ప్రతివారం సోమవారం రోజు ఆ వారం ఎలిమినేట్ అయ్యేవారి పేర్లను ప్రకటిస్తారు బిగ్ బాస్. అయితే ఈ సారి ఆదివారం నుండి మూడోవారంలో ఎలిమినేషన్ ఉన్న వారిపేర్లను ప్రకటించడం మొదలుపెట్టారు.

ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతున్న కళ్యాణి.. నాగార్జున ఇచ్చిన బిగ్ బాంబ్‌ను దేవీ నాగవళ్లిపై వేశారు. ఇంతకీ ఆ బాంబ్ ఏంటంటే.. మూడో వారం ఎలిమినేషన్‌కు నామినేట్ చేయడం. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా దేవి పేరును కళ్యాని చెప్పగా నాగార్జున సైతం మూడోవారం నామినేషన్‌లో మీరు ఉన్నారని ప్రకటించారు. దీంతో దేవి షాక్‌ అయింది.