జీవితంలో నీతో మాట్లాడ:అమ్మ రాజశేఖర్‌

189
amma rajashekar

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 26 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. 26వ ఎపిసోడ్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగగా కిల్లర్ కాయిన్స్ పుణ్యమాని సొహైల్- అమ్మ రాజశేఖర్ మధ్య గొడవ మూడో రోజుకు కంటిన్యూ అవుతూనే వచ్చింది. తొలి రోజు గొడవ అనంతరం మాస్టర్‌కు సారీ చెప్పారు సొహైల్. అయితే తర్వాత అంత సెట్ అయిందని అనుకున్న క్రమంలోనే సొహైల్ మాస్టర్‌కు హ్యాండ్ ఇవ్వడంతో తెగ బాధపడ్డారు రాజశేఖర్ మాస్టర్‌.

మూడో దశ కిల్లర్ కాయిన్ టాస్క్‌లో భాగంగా ఎండ్ బజర్ మోగగానే ఇంటి సభ్యులందరూ ఏదైనా చేసుకుని కాయిన్స్ విలువ పెంచుకోవచ్చని ఇంటి సభ్యుల మధ్య ఫిటింగ్ పెట్టారు. అయితే లాస్య ,అరియానా, నోయల్, దివి, అవినాష్‌ అంతా తమ దగ్గర ఉన్న కాయిన్స్ రాజశేఖర్ మాస్టర్‌కి ఇచ్చేశారు.

ఇక సొహైల్, అఖిల్, మోనాల్‌లు తమ మద్ద ఉన్న కాయిన్స్‌ని మెహబూబ్‌కి ఇచ్చేశాడు. ఇక సొహైల్ రాజశేఖర్ మాస్టర్‌కి కాయిన్స్ ఇచ్చేయడానికి డిసైడ్ అవ్వగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకు అని మొహబూబ్ కన్వెన్స్ చేశాడు. దీంతో మెహబూబ్ మాటలకు కన్విన్స్ అయిన సొహైల్ తన కాయిన్స్‌ మాస్టర్‌కు ఇవ్వలేదు. దీంతో మాస్టర్‌కు కోపం తెప్పించింది. జీవితంలో నీతో మాట్లాడనని నమ్మక ద్రోహం చేశావని మండిపడ్డారు. తర్వాత అభిజిత్ కూడా మాస్టర్‌కు కాయిన్స్‌ ఇస్తే బాగుండేదని సూచించగా సొహైల్ ఏమి చెప్పలేకపోయారు.