కుమార్ సాయి @ కెప్టెన్ బాండ్

124
bigg boss captain

మూడు దశల్లో సాగిన కిల్లర్ కాయిన్స్‌ తర్వాత కాసుల వేటలో విజేతగా నిలిచిన కుమార్ సాయి ఈ వారం ఎలిమినేషన్ నుండి ముందుగానే సేవ్ అయ్యాడు. హౌస్‌లోని ఎంటరైన దగ్గరి నుండి ప్రతివారం ఎలిమినేషన్‌కు నామినేట్ అవుతున్న కుమార్ సాయి ప్రేక్షకులు ఇచ్చే ఓటింగ్‌తో సేవ్ అవుతూ వస్తున్నారు. గత వారం ఓటింగ్‌లో టాప్‌లో ఉన్న సాయి…ఈ వారం సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు.

అయితే ఈ వారం కెప్టెన్సీ పోటీ దారులుగా ఎంపికైన రాజశేఖర్, కుమార్ సాయి, హారిక, సుజాత‌లకు కాసుల వేట టాస్క్ ఇచ్చారు. మట్టిలో కాయిన్స్ ఇచ్చి వాటిని వెతికి పట్టి బుట్టలో వేయాలని ఎవరి బుట్టలో ఎక్కువ కాయిన్స్ పడితే వాళ్లే విన్నర్ అని బిగ్ బాస్ ప్రకటించగా అనూహ్యంగా తన ఆటతో టాప్‌లో నిలిచాడు సాయి.

కుమార్ సాయికి 3500 కాయిన్స్ రాగా హారికకు 2000 కాయిన్స్,రాజశేఖర్ మాస్టర్‌ 2300, సుజాత 2900 కాయిన్స్ రావడంతో ఈవారం కెప్టెన్‌గా కుమార్ సాయి నిలిచాడు. కెప్టెన్ బ్యాండ్ ధరించాలని బిగ్ బాస్ కోరడంతో పాటు బాండ్ ధరించిన కారణంగా వచ్చే నామినేషన్స్ నుంచి మినహాయింపు లభించింది. దీంతో వరుసగా కుమార్ సాయిని టార్గెట్ చేస్తూ నామినేట్ చేస్తుండగా.. కెప్టెన్ బాండ్ లభించడంతో వచ్చే వారం నామినేషన్ నుంచి విముక్తి పొందాడు కుమార్ సాయి. అయితే ఈవారం మాత్రం నామినేషన్‌లోనే ఉన్నా సాయి సేవ్ అవడం గ్యారెంటీ.