మళ్లీ అఖిల్ -అభిజిత్ మధ్య రచ్చ రచ్చ!

30
akhil

బిగ్ బాస్ 4 తెలుగు 11వ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ ఎపిసోడ్ ఇంటి సభ్యుల మధ్య దూరాన్ని మరింత పెంచేసింది. బిగ్ బాస్ హౌస్‌లో ఎంటరైన తర్వాత ప్రతివారం ఒకరిని మరొకరూ నామినేట్ చేస్తూ ప్రత్యర్థుల్లా మారిపోయారు అఖిల్-అభిజిత్. ఇందుకు మోనాల్ కారణం కాగా గత రెండు వారాల్లో వీరిద్దరూ కలిసిపోయారు. దీంతో అంతా కూల్ అనుకుంటుండగానే 11వ వారం మళ్లీ వీరిద్దరి మధ్య గొడవతో హౌస్ రచ్చరచ్చగా మారింది.

అఖిల్.. అభిజిత్‌ని నామినేట్ చేస్తూ చెలరేగిపోయాడు. మటన్ షాపు ఓనర్ మేకకి గడ్డి చూపించాడు.. మేక లేపలికి వెళ్లిపోయింది.. ఆ తరువాత ఏం కాలేదు అభిజిత్.. మేకను పులిగా బయటకు వదిలింది. అదే ఇప్పుడు నేను కెప్టెన్ అయ్యా అంటూ తెలిపాడు. మేక ఎప్పుడూ పులి కాదు బాబూ.. మేక బలి అవుతుంది అంటూ అఖిల్‌కు అభి కౌంటర్ ఇచ్చాడు.

నా సోచ్ గురించి మాట్లాడావు అని అభి చెప్ప‌గానే అస‌లు నీకు బుద్ధి ఉంటే క‌దా? అని అఖిల్ నోరు జారాడు. దీంతో రెచ్చిపోయిన అభి కూడా ఇంత జ‌రిగినా నీకు బుద్ధి రాలేదు, ముందు నువ్వు గుడ్లు బ‌య‌ట‌కు తీయ‌కు, కింద‌కు ప‌డిపోతాయ్ అని వెట‌కారంగా మాట్లాడాడు. నువ్వేమైనా తురుమ్‌ఖాన్‌వా? కెప్టెన్ అయ్యావ‌ని చెట్టెక్కి కూర్చున్నావు. అని గ‌రమ‌య్యాడు.

నాకు 32, నీది 25 ఏళ్లు.. బ‌చ్చాగానివి.. ఛ‌ల్‌ఛ‌ల్‌, జా అంటూ అఖిల్ నోరు మూయించేందుకు ప్ర‌య‌త్నించాడు అభిజిత్. అయినా త‌గ్గ‌ని అఖిల్ 25 ఏళ్ల‌లోనే తాను బిగ్‌బాస్‌కు వ‌చ్చాన‌ని చెప్పుకొచ్చాడు. నువ్ నా ముందు బచ్చాగానికి నీకు ఏం తెలియదు కూర్చో పక్కన.. ఆ ఆటలు ఇంట్లో ఆడుకో అఖిల్‌కి గట్టి క్లాస్ పీకాడు అభిజిత్. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య ఉన్న వైరం మరోసారి తారాస్థాయికి చేరుకుంది.