హమ్మయ్య.. అఖిల్ కి ఓ కథ దొరికింది

33
- Advertisement -

అన్నీ ఉన్నా అక్కినేని అఖిల్ కి బాక్సాఫీస్ శని అన్నట్టు ఉంది పరిస్థితి. మనం సినిమాలో అఖిల్ ఎంట్రీ షాట్స్ చూసి.. కాబోయే సూపర్ స్టార్ అంటూ ప్రస్తుత సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మెచ్చుకున్నాడు. కానీ, అఖిల్ రాత బాగాలేదో.. లేక అతని కథల ఎంపిక బాగాలేదో తెలియదు గానీ, అఖిల్ కి మాత్రం హిట్ పడటం లేదు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అఖిల్ కి హిట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ కోసం మంచి కథ రాశాను అంటూ ముందుకు వచ్చాడు శ్రీకాంత్ అడ్డాల. ప్రస్తుతం పెద కాపు సినిమాలో బిజీగా ఉన్నాడు శ్రీకాంత్ అడ్డాల.

అయితే, పెద కాపు సినిమా ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యే ఎండింగ్ స్టేజ్ లో ఉంది. దాంతో అడ్డాల చూపు ఇప్పుడు అఖిల్ పై పడింది. ఈ సారి అఖిల్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్ట్రాంగ్ కథతో వస్తున్నాడట. పలనాడు నేర చరిత్ర, రాజకీయ నాయకులు అవినీతి వంటి అంశాల ఆధారంగా శ్రీకాంత్ ఓ కథ రాశాడు. ఈ కథతో రూపొందనున్న సినిమాలో అఖిల్ అక్కినేని హీరోగా నటించనున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే దాదాపు ఈ కాంబినేషన్ ఫిక్స్ అయ్యింది.

ఈ క్రమంలోనే ఇప్పటికే కథపై అఖిల్ అక్కినేని దృష్టి సారించాడు. దీనిలో భాగంగా అఖిల్ రఫ్ లుక్ కోసం కసరత్తులు స్టార్ట్ చేశాడు. అన్నట్టు శ్రీకాంత్ అడ్డాల ఆరు నెలల క్రితమే అఖిల్ ఈ కథ చెప్పారని.. అది విని అఖిల్ అక్కినేని చాలా ఇన్‌స్పైర్ అయ్యాడని తెలుస్తోంది. ఏది ఏమైనా అఖిల్ కి ఇది చాలా కీలకమైన మూవీ. ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలి. ఎందుకంటే ఇప్పటికే వరుసగా ఫ్లాపులు చూశాడు. అందుకే అఖిల్ ఈ సినిమా కోసం తెగ కష్ట పడి పోతున్నాడు.

Also Read:మళ్ళీ పార్లమెంట్ లోకి రాహుల్..మోడీకి షాక్!

- Advertisement -