ప్రశాంత్ రైతు బిడ్డ..అండగా అఖిల్!

24
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 9 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక 9వ ఎపిసోడ్లో భాగంగా పల్లవి ప్రశాంత్ రచ్చరచ్చ చేశాడు. తన నామినేషన్ సందర్భంగా ఓ పిచ్చిపట్టిన వాడిలో అరుస్తూ గబ్బుపట్టించాడు. అయితే పల్లవి ప్రశాంత్‌కి అండగా నిలిచాడు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్.

బిగ్ బాస్ చూసి వచ్చాడు అని అంటున్నారు.. వస్తే ఏంటి? అందులో తప్పేముందని అన్నారు అఖిల్. నార్మల్ ఆర్టిస్టులమైన మనకే అక్కడికి వెళ్లాక ఆపుకోలేం.. విలేజ్ నుంచి వచ్చాడు.. అతను కాస్త ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నాడేమో అంతకుమించి ఏముందన్నారు. లవ్ ట్రాక్‌తో కామెడీ పుట్టించాలని అనుకుంటున్నాడేమో.. అది అతని ఆట.. అది తప్పే గానీ.. ఏదో ప్రయత్నిస్తున్నాడు.. వచ్చినదాంట్లో చేస్తున్నాడు.. అని చెప్పుకొచ్చాడు. ప్రశాంత్‌కి అందరూ భయపడినట్టుగా ఉన్నారు.. అందుకే అందరూ టార్గెట్ చేశారని ధైర్యంగా రైతు బిడ్డా అని తెలిపారు అఖిల్.

ఇక ప్రశాంత్ పదేపదే రైతు బిడ్డ ట్యాగ్‌ని వాడుకోవడం కంటెస్టెంట్స్‌కి నచ్చడం లేదు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ప్రశాంత్‌ని టార్గెట్ చేశారు. సెంటిమెంట్ ట్రాక్ వాడుకోవడం వద్దు.. నామినేషన్స్ టైంలో ఎలా ఉంటున్నావో.. ఇంట్లో కూడా అలానే ఉండు అని కౌంటర్లు వేశారు. ఈ క్రమంలో అంతా ప్రశాంత్‌ని టార్గెట్ చేయడంతో అఖిల్ అండగా నిలబడ్డాడు.

Also Read:Bigg Boss 7 Telugu:ఎపిసోడ్ 9 హైలైట్స్

- Advertisement -