బిగ్ బాస్ 4…దేత్తడి వర్సెస్ సొహైల్

49
harika

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 72 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 11వ వారం నామినేషన్ ఎపిసోడ్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్దంతో ఒక్కసారిగా హౌస్‌లో వేడి పెరిగిపోయింది. ముఖ్యంగా సొహైల్- దేత్తడి హారిక మధ్య రచ్చరచ్చ జరిగింది.

సోహైల్‌.. త‌న‌ను చిచ్చుబుడ్డి అన్న‌వారికి థ్యాంక్స్ చెప్పాడు. ఆటంబాంబు క‌న్నా చిచ్చుబుడ్డే బెట‌ర్ అని అభిప్రాయ‌ప‌డ్డాడు. కానీ హారిక మాత్రం ఎవ్వ‌రూ దేఖ‌రు, వేస్ట్‌గాడు అనడం తనకు నచ్చలేదని తెలిపింది. ఆమెను ఎప్పుడూ ఒక్క‌మాట అన‌లేదు అని బాధ‌ప‌డుతూనే సీరియ‌స్ అయ్యాడు. దీనిక హారిక స్పందిస్తూ నీ అవ్వ పో అన‌డం నీకు ఊత‌ప‌దం అయిన‌ప్పుడు వేస్ట్‌గాడు అనేది నాకు ఊత‌ప‌దం అని స్ప‌ష్టం చేసింది. అలా ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెరిగింది.

ఇక హారికకు కోపం తెప్పించేలా గింతంత లేవు, ఆపు అని రెచ్చ‌గొట్టాడు. దీంతో ఆమె నా హైట్‌ను ఎందుకు అంటున్నావు. నువ్వు మాస్ అయితే నేను ఊర‌మాస్ అనగా నేనే ఊరకే ఊర మాస్ అంటూ సొహైల్ గట్టిగా అరిచాడు. కాసేపు ఇలానే ఇద్దరి మధ్య మాటల యుద్దం కంటిన్యూ అయింది. ఇక అభిజిత్ తనని నామినేట్ చేసిన సందర్భంలో కూడా సొహైల్ పరోక్షంగా హారిక ప్రస్తావన తెస్తూ తనది బ్రో బ్యాచ్ కాదని ఎద్దేవా చేశాడు. దీంతో హారిక కూడా సొహైల్‌ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. మొత్తంగా 11వ వారం నామినేషన్ ఎపిసోడ్ ఇంటి సభ్యుల మధ్య గ్యాప్‌ని మరింత పెంచేసింది.