బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 9 హైలైట్స్

281
episode 9
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు సోమవారంతో 9వ ఎపిసోడ్ పూర్తిచేసుకుంది. మొదటివారంలో సూర్యకిరణ్ ఇంటి నుండి బయటికి రాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా సాయి హౌస్‌లోకి ఎంటర్‌ అయ్యారు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో ఏకంగా 9 మంది ఉండగా గంగవ్వ మళ్లీ ఎలిమినేషన్‌కి నామినేట్ అయింది.

రెండో వారం ఎలిమినేషన్‌లో బిగ్ హౌస్‌లోకి పడవను పంపిన బిగ్ బాస్‌ కెప్టెన్ లాస్యను మినహాయించి 15 మంది పడవలో కూర్చోవాలని కోరారు. ఈ పడవ తొమ్మిది తీరాలకు చేరుతుందని అలా తీరం చేరిన ప్రతిసారి ఒకరు దిగాలని వారు ఎలిమినేషన్‌కు నామినేట్ అవుతారని తెలిపారు.తొలుత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కుమార్ సాయిని దిగాలని నోయల్ కోరాగా అందరూ దిగాలని కోరితే తప్పకుండా దిగుతానని అన్న సాయి తర్వాత తన మనసు మార్చుకున్నాడు. తర్వాత గంగవ్వ కూడా తొలుత దిగను అనడం..కాసేపటి తర్వాత కాళ్లు పట్టేయడంతో పడవ దిగిపోయింది.

తర్వాత సొహైల్, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణిలు సెల్ఫ్ నామినేట్ కావడంతో అనంతరం కుమార్ సాయి కూడా సెల్ఫ్ నామినేట్ అయ్యాడు.వీరి తర్వాత దేత్తడి హారిక, అభిజిత్‌లు కూడా సెల్ఫ్ నామినేట్ అయ్యారు.దీంతో రెండో వారం జరిగే ఎలిమినేషన్‌కి గంగవ్వ, నోయల్, మొనాల్, సొహైల్, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్‌లు నామినేట్ అయ్యారు. ఈ తొమ్మిది మందిలో ఒకరు వచ్చేవారం బ్యాగ్ సర్దేయనున్నారు. మొత్తంగా వరుసగా రెండోవారం గంగవ్వ ఎలిమినేషన్‌కి నామినేట్ అయింది.

అంతకముందు తొలుత అఖిల్ సిద్దార్థ్, మొనాల్ గజ్జర్‌లు వంటగదిలో బిజీ అయ్యారు. ఒకర్ని ఒకరు పొగుడుకుంటూ మెల్ల మెల్లగా బిగ్ బాస్ హౌస్‌లో ఏదో కథ మొదలవ్వబోతుందని ముందే హింట్ ఇచ్చారు. మొనాల్ తన కోసం పాట పాడాలని అఖిల్‌ని కోరగా.. అఖిల్ రాగం అందుకోవడంతో తెగ సిగ్గుపడిపోతూ అతనికి దిష్టితీసేసింది మొనాల్. తర్వాత బిగ్ బాస్ కెమెరాల ద్వారా మొనాల్ తన తల్లికి అఖిల్‌ని పరిచయం చేసింది.

తర్వాత మార్నింగ్ వేకప్ సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులు వేశారు ఇంటి సభ్యులు. ముఖ్యంగా దేత్తడి హారిక నాభిసోయగాలతో అలరించింది. అఖిల్-మొనాల్‌లు జంటగానే స్టెప్పులు వేశారు. అనంతరం మొనాల్‌‌తో పులిహోర కలిపే పనిలో అభిజిత్ బాగా బిజీ అయ్యాడు.

ఇక అభిజిత్‌తో మొనాల్ ముచ్చట్లు పెట్టడంతో తెగ ఫీల్ అయిపోయాడు అఖిల్. ముఖం మాడ్చుకుని మొనాల్‌తో కొంతసేపు మాట్లాడటం మానేశాడు. దీంతో మొనాల్ అతని దగ్గరకు వచ్చి.. మళ్లీ ఏడుపుస్టార్ట్ చేస్తూ మొనాల్ అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోయింది. ఆ తరువాత తెగ ఫీల్ అయిపోయిన అఖిల్.. మొనాల్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించాడు.లాస్య సర్దిచెప్పడంతో మొనాల్ నవ్వుతూ అఖిల్ దగ్గరకు రావడం తర్వాత షరామామూలే. చాలాసేపు తర్వాత మొనాలం…తనకు అభితో ఏం లేదు.. నీతోనూ ఏం లేదు.. కాని నీతో టైం స్పెండ్ చేయడం నాకు ఇష్టం తెలిపింది.

ప్రతి సోమవారం ఇంటి సభ్యులకు రేషన్ ఇవ్వడం జరుగుతుందని.. రేషన్ మేనేజర్.. ఇంటి సభ్యులకు రేషన్‌ని అందజేస్తాడని.. ప్రతిసారి రేషన్ వచ్చినప్పుడు రేషన్ మేనేజర్‌కి 1000 లగ్జరీ పాయింట్లు లభిస్తాయని తెలిపారు బిగ్ బాస్. రేషన్ మేనేజర్‌ని ఎంపికచేసే బాధ్యత లాస్యకు అప్పజెప్పగా అమ్మరాజశేఖర్‌ని ఎంపికచేసింది.

- Advertisement -