బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 10 హైలైట్స్

332
bigg boss 4 telugu

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 10 ఎపిసోడ్‌లను పూర్తిచేసుకుంది. రెండోవారంలో ఎలిమినేషన్‌కి 9 మంది నామినేట్ కాగా 10వ ఎపిసోడ్‌లో లవ్ ఎపిసోడ్-అలక కంటిన్యూ కాగా అమ్మ రాజశేఖర్-కరాటే కల్యాణి మధ్య ఫన్నీ డ్యాన్స్,రొమాన్స్ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి.

అభిజిత్-మొనాల్‌లు ప్రేమగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకున్నారు. ఎంత మంది అమ్మాయిల్ని లవ్ చేశాను.. ఎన్ని బ్రేకప్‌లు అయ్యాయను విషయాలను మొనాల్‌తో పంచుకున్నాడు అభిజిత్. తర్వాత రోజు కిచెన్ విషయంలో కొంతమందే బాధ్యత తీసుకుంటున్నారని అంతా బాధ్యత తీసుకోవాలని కెప్టెన్ లాస్యతో చర్చించింది దేవి.

ఈ సందర్బంగా అఖిల్ గాలి తీసేసింది దేవి. అఖిల్ మామూలు పులిహోర కలిపితే.. సొహైల్ తాలింపు కూడా వేస్తాడని చెప్పింది. ఇక మార్నింగ్ మస్తీలో భాగంగా దేత్తడి హారిక క్లీవేజ్ షోతో అందాల కనువిందు చేసింది. ఇప్పటి కింకా నావయసు నిండా పదహారే పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తూ రెచ్చిపోయింది.

ఇక గంగవ్వతో కలిసి నోయల్‌ని పెళ్లి చేసుకుంటా అంటూ సీన్ క్రియేట్ చేసి అందర్నీ అలరించింది హారిక. పెళ్లైన వాడిని పెళ్లి చేసుకుంటావా?? సిగ్గు లేదా?? అంటూ ఇద్దరి గాలి తీసేసింది గంగవ్వ. నీ పేరు రాసి చచ్చిపోతా అని నోయల్ ఆట పట్టించగా.. పోయి చావు అంటూ గంగవ్వ అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది.

అనంతరం మొహబూబ్‌కు అదిరిపోయే విధంగా ఛాలెంజ్‌ ఇచ్చాడు రాజశేఖర్ మాస్టర్. కరాటే కల్యాణిని ఎత్తుకోవాలని కోరగా అతికష్టంమీద ఆమెను ఎత్తుకున్నాడు. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర మొనాల్‌.. అఖిల్‌ని అడిగిమరీ ముద్దలు పెట్టించుకోవడం అది చూసిన అభిజిత్ మొఖం మాడ్చుకోవడం ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఈవారం లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా అత్తా అల్లుడు-అమెరికా మోజు అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. గయ్యాళి అత్తగా కళ్యాణి ,పని మనిషి పాత్రలో దేవి ,కళ్యాణి కూతురి పాత్రలో దివి, అమెరికా అల్లుడు పాత్రలో అఖిల్, కళ్యాణి కోడలు పాత్రలో సుజాత, మతిమరుపు గుమస్తాగా కుమార్ సాయి నటించి మెప్పించారు.