బిగ్ బాస్ 4…ఎవరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!

173
bigg boss 4

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 9 ఎపిసోడ్‌లను పూర్తిచేసుకుంది. 15 వారాల పాటు జరిగే ఈ షోలో ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలిపి 17 మంది ఎంటర్‌కాగా తొలివారం సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యారు.

ఇక ఈ సీజన్‌లో హౌస్‌మేట్ల ఎంపికపై భిన్నస్వరాలు వినిపిస్తుండగా ఉన్నవారిలో ఎవరి రెమ్యునరేషన్ ఎంత అనేదానిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అందరికంటే ఎక్కువగా యాంకర్ లాస్య, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మాస్టర్‌లకు రోజుకి లక్ష చొప్పున ఇచ్చినట్టు సమాచారం.మిగిలిన కంటెస్టెంట్స్‌‌కి రోజుకి 50 వేలు నుంచి 10 వేలు వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక క్వారంటైన్‌లో ఉన్నప్పటి నుంచి కూడా కంటెస్టెంట్స్‌కి రెమ్యునరేషన్ చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది.

మోనాల్ గుజ్జార్ -రూ.50 వేలు, డైరెక్టర్ సూర్యకిరణ్-రూ.50 వేలు,అభిజిత్-రూ.20 వేలు,జోర్దార్ యాంకర్ సుజాత-రూ. 10 వేలు,మెహబూబ్ దిల్‌సే -రూ. 10 వేలు,టీవీ 9 యాంకర్ దేవి-రూ. 25 వేలు,దేత్తడి హారిక-రూ.25 వేలు, టీవీ యాక్టర్ సయ్యద్ సోహైల్-రూ.10 వేలు, యాంకర్ అరియానా గ్లోరీ-రూ.10 వేలు,కరాటే కళ్యాణి-రూ. 25 వేలు,సింగర్ నోయల్-రూ. 50 వేలు,హీరోయిన్ దివి-రూ.25 వేలు,అఖిల్ సార్థక్-రూ. 10 వేలు,గంగవ్వ-రూ.25 వేలు,కుమార్ సాయి (వైల్డ్ కార్డ్ ఎంట్రీ) రూ-10 వేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కింగ్ నాగార్జునకు షో మొత్తానికి కలిపి రూ. 8 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.