జూలైలో బిగ్‌బాస్ సీజ‌న్ 5 ప్రారంభం..!

58
Bigg Boss

తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుందా! అంటే అవున‌నే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. నాగార్జున వ్యాఖ్యాత‌గా బిగ్‌బాస్ 5ను ఈ వేస‌విలో ప్రారంభించాలని స్టార్ మా నిర్వాహ‌కులు భావించారు. అయితే కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా, ఈ సీజ‌న్‌ను స్టార్ట్ చేయ‌లేదు. అయితే ఇప్పుడు ఐదో సీజ‌న్‌ను షురూ చేయ‌డానికి సన్నాహాలు చేసుకుంటున్నార‌ట‌.

అందులో భాగంగా ఇప్ప‌టికే అందులో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్‌ను జూమ్ ద్వారా ఇంట‌ర్వ్యూ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వారం ప‌దిరోజుల్లో ఫైన‌ల్ కంటెస్టెంట్స్‌ను ఖ‌రారు చేసి, వారిని క్వారంటైన్‌లో ఉంచి త‌ర్వాత సీజ‌న్‌ను స్టార్ట్ చేస్తార‌ట‌. ఈసారి ప్రైజ్ మనీ కూడా పెంచుతున్నారని స‌మాచారం.

జూలై రెండో వారంలో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రారంభం కానునట్లు తెలుస్తోంది. ఇక ఐదో సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానుండటంతో కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ సీజన్‌లో యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, యాంకర్ వర్షిణి, హైపర్ ఆది, సింగర్‌ మంగ్లీ, న్యూస్ యాంకర్ ప్రత్యూష పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ఈ సారి షోకి కూడా నాగార్జునే హాస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలుస్తోంది.