రాష్ట్రం లో రాక్షస పాలన నడుస్తోంది అన్నారు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్.. హోం మంత్రి కూడా ముఖ్యమంత్రే …రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ రేవంత్ ద్వంసం చేస్తున్నారు అన్నారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన సీఎం హరిస్తున్నారు..అసెంబ్లీ సమావేశాల్లో బీ ఆర్ ఎస్ ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని నిలదీసింది అన్నారు. బీ ఆర్ ఎస్ సభ లోపలా బయటా గణాంకాలతో సహా రేవంత్ తీరును ఎండగట్టింది ..బీ ఆర్ ఎస్ ప్రధాన ప్రతిపక్షం గా పోరాడటాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు ..సోషల్ మీడియా లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు అన్నారు.
మార్చి 15 ,16 తేదీల్లో పదిహేను కేసులు పెట్టారు …రీ ట్వీట్ చేసిన వారిపై కేసులు పెడుతున్నారు ..ఐటీ యాక్ట్ కు వ్యతిరేకంగా ఎఫ్ ఐ ఆర్ లు నమోదు అవుతున్నాయి …కేసీఆర్ హయం లో 2023 లో తెలంగాణ సైబర్ సెక్క్యూరిటీ బ్యూరో ఏర్పడింది ..సైబర్ నేరగాళ్ళ నుంచి ప్రజలను కాపాడటానికి మంచి ఉద్దేశం తో ఆ బ్యూరో పెట్టారు…గొప్ప దార్శనికత తో దాన్ని స్థాపించారు ..రేవంత్ హోమ్ మంత్రిగా ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ను దుర్వినియోగం చేస్తున్నారు ..డిజిటల్ మోసాల నుంచి ప్రజలను రక్షించాల్సిన ఆ బ్యూరో ను రేవంత్ రెడ్డి బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా పై ప్రయోగిస్తున్నారు …సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కొందరు రేవంత్ రెడ్డి తొత్తులుగా పని చేస్తూ కాపీ పేస్ట్ ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేస్తున్నారు అన్నారు.
సైబర్ పెట్రోలింగ్ పేరుతో తెలంగాణ భవన్ పైనే ద్రుష్టి కేంద్రీకరించారు ..గాంధీ భవన్ ,బీజేపీ కార్యాలయాలు సైబర్ పెట్రోలింగ్ లో లేవు ..రేవంత్ సైన్యం పేరిట కే టీ ఆర్ పై దారుణమైన పోస్టులు పెడితే చర్యలు లేవు …కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లు ఎన్ని దారుణమైన పోస్టులు పెడుతున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ? ..ఫెయిర్ నెస్ ,పారదర్శకత ఎక్కడుంది ?…గౌతమ్ ,దిలీప్ కొణతం ,క్రిశాంక్ సోషల్ మీడియా పోస్టుల్లో ఎలాంటి అసభ్యత ఉండదు ..అయినా కేసులు నమోదు చేస్తున్నారు …రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారు ..రేవంత్ రాజ్యాంగం ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదు …బాధితుడు,ఇన్వెస్టిగేటర్ ,జడ్జి అన్ని పాత్రలు రేవంత్ రెడ్డి పోషిస్తున్నారు …జైల్లో తనను ఘోరంగా చూశారని రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో అన్నారు …జైల్లో తనను బాగా చూసుకున్నారని ఓ ఛానల్ అధినేత కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇదే రేవంత్ చెప్పారు …నాగయ్య అనే సహా ఖైదీ తనకు అన్ని చేసిపెట్టారని చెప్పారు అన్నారు.
Also Read:మ్యాడ్ స్క్వేర్.. వసూళ్లు అదుర్స్!

