న్యూ లుక్‌లో నారా రోహిత్..

157
nara rohith

యంగ్ హీరో నారా రోహిత్ సినిమా సినిమాకు వైవిధ్యంగా కనిపిస్తు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ యంగ్‌ హీరో చాలా కాలం తర్వాత తన కొత్త సినిమా కోసం అలాగే కొత్త లుక్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ నారా హీరో న్యూలుక్‌ తో కనిపిస్తున్నాడు. ఈ రోజు తన ట్విట్టర్ అకౌంటుకి ఓ కొత్త లుక్కును ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు.

ఈ లుక్‌లో పొడవాటి గెడ్డం .. మీసాలతో తీక్షణంగా చూస్తున్న రోహిత్ లుక్ అదిరిపోయింది. త్వరలో తాను ఓ భారీ బడ్జెట్టు చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రం కోసమే ఈ లుక్ ని ఎంచుకున్నట్టు సినీ వర్గాల సమాచారం. ఈ లుక్ ప్రస్తుతం షోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.