ప్రొటెం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన భూపాల్ రెడ్డి..

15
Telangana Protem Chairman

తెలంగాణ శాసన మండలిలోని చైర్మన్ ఛాంబర్‌లో ప్రొటెం చైర్మన్‌గా వెన్నవరం భూపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ,హోంమంత్రి మహమూద్ అలీ ,తెలంగాణ లెజిస్లేటివ్ సెక్రెటరీ డా” నర్సింహా చార్యులు,మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ చీప్ విప్ బోడకుంటి వెంకటేటేశ్వర్లు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్,పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, భాను ప్రసాద్,ఫారూఖ్ హుస్సేన్,ఎం. ఎస్ ప్రభాకర్ జాఫ్రీ,పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్,జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత,ఫరీదుద్దీన్,భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, తదితరులు భూపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ” ప్రొటెం చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి,కేటీఆర్,మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తిస్తానని ఆయన చెప్పారు.ఏళ్ల వెళ్లాలా ప్రజా ప్రతినిధులకు,ప్రజలకు అందుబాటులో ఉంటూ తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమానికి మెదక్,సంగారెడ్డి జిల్లా టి ఆర్ యస్ పార్టీ నేతలు,భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.