గవర్నర్‌ను కలిసిన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి..

25

శాస‌న మండ‌లి ప్రొటెం చైర్మ‌న్‌గా నియ‌మితులైన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప‌ద‌వీ కాలం ముగిసిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప్రొటెమ్ చైర్మ‌న్‌ను నియ‌మించింది. ఈ సందర్భంగా ఈరోజు రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్‌ను శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.

2007 నుంచి ఎమ్మెల్సీగా ఉన్న భూపాల్ రెడ్డి ఉమ్మడి మెదక్‌ జిల్లా పటాన్‌చెరు నియోజకర్గంలోని రామచంద్రాపురం గ్రామంలో జన్మించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మూడుసార్లు విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన భూపాల్‌రెడ్డి.. జిల్లా పరిషత్‌ పంచాయతీ సమితి కో-ఆప్షన్‌ సభ్యుడి స్థాయి నుంచి ఎంపీపీగా పనిచేశారు.