బ్రెజిల్ ఒప్పందంపై భారత్ బయోటెక్ వివరణ..

272
bharath
- Advertisement -

భారత్‌ బయోటెక్‌తో చేసుకున్న ఒప్పందాన్ని బ్రెజిల్ క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇచ్చింది భారత్ బయోటెక్. అన్నిదేశాల‌తో ఒప్పందం మాదిరిగానే బ్రెజిల్ ఒప్పందం కూడా జ‌రిగింద‌ని, ఇందులో త‌మ త‌ప్పేమీలేద‌ని భార‌త్ బ‌యోటెక్ సంస్థ వివ‌ర‌ణ ఇచ్చింది. బ్రెజిల్ నుంచి త‌మ‌కు ఎలాంటి అడ్వాంసులు వంటికి జ‌ర‌గ‌లేద‌ని ఆ సంస్థ తెలియ‌జేసింది.

భార‌త్ బ‌యోటెక్ సంస్థ త‌యారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను దేశంలో వేగంగా అమ‌లుచేస్తున్నారు. క‌రోనా వ్యాక్సిన్ ను ఇప్ప‌టికే అనేక దేశాల‌కు పంపిణీచేస్తున్న సంగ‌తి తెలిసిందే. బ్రెజిల్ 2 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌కు ఆర్డ‌ర్ ఇచ్చి, క్యాన్సిల్ చేసుకున్నది. ఈ డీల్ విలువ 324 మిలియ‌న్ డాల‌ర్లు.

- Advertisement -