నేటినుంచి నాజల్‌స్ప్రే వినియోగం

35
- Advertisement -

గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్లు పుట్టుకోస్తున్న వేళ భారతప్రభుత్వం మందస్తు చర్యలకు సిద్దమైంది. ఇప్పటికే భారత్‌లోని 18యేళ్లు పైబడిన వారందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని భారత ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కోవాగ్జిన్‌ ఉత్పత్తి చేసిన భారత్ బయోటెక్‌ కంపెనీ నుంచి నాజల్ స్ప్రే ముక్కు ద్వారా వ్యాక్సిన్‌ వేయడం (నాజల్ స్ప్రే)ను త్వరలో దేశంలోకి బూస్టర్ డోస్‌గా తీసుకువస్తున్నట్టు ప్రకటించింది.

కోవాగ్జిన్ టీకా నుంచి నాజల్ వ్యాక్సిన్‌ రూపంలో దీన్ని అందించనున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ నాసల్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండనున్నాయి. కొవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా ఈ వ్యాక్సిన్ ఇవాళ్టి నుంచి అందుబాటులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ తో ప్రపంచం అతలాకుతలం అవుతున్న వేళ నాజల్ వాక్సిన్‌ అనుమతి త్వరతగతిన అనుమతులను మంజూరు చేసింది.

ఇవి కూడా చదవండి…

నిద్రపోయే ముందు ఇలా చేస్తున్నారా.. జాగ్రత్త!

పాపారావును కలిసిన పవన్‌…

చలికాలంలో ఈ పండు తింటే.. ఇన్ని ఉపయోగాలా !

 

- Advertisement -