పెరిగిన వంటగ్యాస్ ధరలు..

177
gas

వంటగ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. 12.2 కిలోల బరువున్న సబ్సిడీ సిలిండర్‌పై రూ.25.50 ధరను పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానుండగా పెంచిన ధరతో దేశ రాజధానిలో సిలిండర్‌ ధర రూ.834.50కు చేరింది.

ఇక 19 కిలోల సిలిండర్‌పై సైతం రూ.76 పెరుగగా దేశ రాజధానిలో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1550కు చేరువైంది. హైదరాబాద్‌లో వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.16 పెరుగగా ధర రూ.877.50కు చేరింది. వాణిజ్య సిలిండర్‌పై రూ.84 పెరగ్గా.. రూ.1768కు పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి సబ్సిడీ సిలిండర్ల ధరలు దాదాపు ఐదుసార్లు పెరిగాయి.