బెంగాల్‌లో బీజేపీకి దబిడిదిబిడే..!

146
bjp
- Advertisement -

పశ్చిమబెంగాల్ ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయి. అధికార టీఎంసీ, బీజేపీ నేతల మధ్య దాడులు, ప్రతిదాడులతో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఇటీవల కొందరు కాషాయ కార్యకర్తలు పోలింగ్ స్టేషన్‌లో పోలింగ్ సరళిని చూసేందుకు వెళ్లిన టీఎంసీ దళిత అభ్యర్థిని వెంటపడి ఇటుకలతో దాడి చేయడం బెంగాల్‌లో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఒక మహిళ అని కూడా చూడకుండా కాషాయమూకలు టీఎంసీ అభ్యర్థిపై అమానుషంగా దాడి చేయడం పట్ల టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ నిప్పులు చెరిగారు. ఎన్నికలలో గెలవడానికి బీజేపీ అరాచకం చేస్తుందని, యుపీ వంటి బీజేపీ రాష్ట్రాలనుంచి కోట్లాది రూపాయల నల్లధనం తీసుకువచ్చి…సీఆర్సీఎప్ దళాలతొ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని విమర్శించారు.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్లు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ, ఓటర్లపై దాడులు చేస్తున్నారని, మహిళలను వేధిస్తున్నారని దీదీ ఆరోపించారు.

సీఆర్పీఎఫ్‌, సీఐఎస్ఎఫ్‌తో పాటు బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ జవాన్లు బెంగాల్ ప్రజలపై దాడులు, వేధింపులకు పాల్పడకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదేశాల ప్రకారమే ఈ చర్యలకు పాల్పడుతున్నారని దీదీ ఫైర్ అయ్యారు. అయితే మరోవైపు బీజేపీ నేతలను బెంగాల్ ప్రజలు తరిమికొడుతున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. కూచ్ బెహార్ జిల్లాలోని సిటాల్‌కుచి ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఆయన కారుపై కొంత మంది రాళ్లు విసిరినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో దిలీప్ ఘోష్ షేర్ చేశారు.

వీడియోలో దిలీప్ ఘోష్‌కి చెందిన కాన్వాయ్‌లోని ఒక కారు అద్దం పగిలి ఉంది. రాయితో బలంగా కొట్టడం వల్ల ఆ అద్దం పగిలిందని బీజేపీ నేతలు అంటున్నారు. అద్దం పగిలినప్పటికీ కాన్వాయ్‌ని ఆపకుండా ముందుకు వెళ్లారు. అయితే తనపై దాడి చేసింది టీఎంసీ కార్యకర్తలేనని దిలీప్ ఘోష్ ఆరోపించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులపట్ల నిరంకుశంగా వ్యవహిస్తున్న మోదీసర్కార్‌పై బెంగాల్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అలాగే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా సామాన్య ప్రజలు బీజేపీ నాయకులు కనిపిస్తే చాలు వారిని తమ గ్రామాల్లోకి రానివ్వకుండా తన్ని తరముతున్నారని, ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌ కాన్వాయ్‌పై స్థానికులు దాడికి పాల్పడి తమ నిరసన తెలియజేసినట్లు తెలుస్తోంది.. మొత్తంగా 8 విడతల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసేలోగా ఇంకెన్ని అరాచక ఘటనలు చోటు చేసుకుంటాయో చూడాలి.

- Advertisement -