టీమిండియాకు రూ. 5 కోట్ల బోనస్‌: బీసీసీఐ

66
India

ఆసీస్ గడ్డపై భారత్‌ ఘన విజయం సాధించింది. గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మూడు వికెట్ల తేడాతో భారత్ గెలుపొందగా సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కనకవర్షం కురిపించింది. టీమిండియా ఆట‌గాళ్ల‌కు రూ.5 కోట్ల టీమ్ బోన‌స్‌ను ప్ర‌క‌టించింది బీసీసీఐ.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ, కార్య‌ద‌ర్శి జే షా. ఇదో అద్భుత విజ‌యం అని, ఆస్ట్రేలియాకు వెళ్లి అక్క‌డ టెస్ట్ సిరీస్‌ను గెల‌వ‌డం అపూర్వ‌మ‌ని బీసీసీఐ అధ్య‌క్షుడు గంగూలీ అన్నారు. ఆట‌గాళ్లకు టీమ్ బోన‌స్‌గా 5 కోట్లు ప్ర‌క‌టించామ‌ని, భార‌త క్రికెట్‌కు ఇవి ప్ర‌త్యేక‌మైన క్ష‌ణాల‌ని, అద్భుత నైపుణ్యాన్ని, ప్ర‌తిభ‌ను భార‌త జ‌ట్టు ప్ర‌ద‌ర్శించిన కార్య‌ద‌ర్శి జే షా త‌న ట్వీట్‌లో తెలిపారు.