రెండు రోజుల పాటు బ్యాంకుల సమ్మె..

188
banks strike

బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 9 బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 16, 17 తేదీల్లో బ్యాంకుల సమ్మె చేయాలని పిలుపునిచ్చాయి.. ఇందులో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో బ్యాంక్ యూనియన్ కన్వీనర్ బి ఎస్ రాంబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ బ్యాంకు లలో ప్రైవేటీకరణ చేస్తే తీవ్రమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బ్యాంకు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు దాచుకున్న డబ్బులు భద్రత ఉండదని బ్యాంకులు ఎప్పుడైనా ఇవాళ చేయవచ్చునని తెలిపారు తర్వాత ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు రావని ఉద్యోగ సమస్య పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.