5 రోజులు…బ్యాంకులు బంద్

221
banks strike
- Advertisement -

దేశవ్యాప్తంగా 5 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. రేపటి నుండి(21 నుండి 26 వరకు) బ్యాంకులు పనిచేయవు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. నెలాఖరు కావడంతో బంద్ ప్రభావం వేతన జీవులపై భారీగా పడబోతోంది.

ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌(ఏఐబీవోసీ) డిసెంబరు 21న సమ్మెకు పిలుపునిచ్చింది. డిసెంబరు 22 నాలుగో శనివారం, 23వ తేదీ ఆదివారం కావడంతో సాధారణంగా బ్యాంకులు పనిచేయవు.25వ తేదీ క్రిస్మస్‌ సెలవు. డిసెంబరు 26న యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్‌ సమ్మెకు దిగుతోంది. 24వతేదీన బ్యాంకు తెరచి ఉంచినా…26 (బుధవారం) వరకు బ్యాంకు సేవలు స్తంభించనున్నాయి.

బ్యాంకుల వరుస సెలవులతో నగదు కొరత ఏర్పడకుండా ఏటీఎంలలో నగదును నింపాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు. అయితే అవి ఏ మేరకు ప్రజల అవసరాలను తీర్చుతాయన్నది ప్రశ్నగానే మిగిలింది.

- Advertisement -