నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ అనే సినిమా తెరకెక్కించేందుకు అంతా సిద్దమైంది. ఏకంగా ఉప రాష్ట్పపతి వెంకయ్యనాయుడుతో సినిమా లాంచ్‌ను గ్రాండ్‌గా ఏర్పాటుచేశారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళుతుందని అందరూ ఊహించారు. కానీ ఉన్నట్టుండి ఈ సినిమా నుండి డైరెక్టర్ తేజ తప్పుకున్నాడు.
దీంతో బాలయ్యకు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లోకెళ్లాడు. అందరి ఊహలకు అందకుండా ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రాన్ని బాలకృష్ణే తెరకెక్కిస్తారని వార్తలు జోరుగా వినిపించాయి. ఆ తర్వాత రాఘవేంద్రరావు పేరు కూడా వినిపించింది. తాజాగా మరోక దర్శకుడు క్రిష్ పేరు వినిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడి విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం వేలువడలేదు.
కానీ ఇదిలా ఉండగా బాలకృష్ణ వీవీ.వినాయక్ డైరెక్షన్లో ఓ సినిమాలో నటించేందుకు సిద్దమయ్యాడు. ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక ఈ మూవీలో బాలకృష్ణ సరసన హీరోయిన్గా శ్రియ కనిపించనుందని సమాచారం. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘చెన్నకేశవరెడ్డి’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి, ‘పైసా వసూల్’ వంటి చిత్రాల్లో నటించడంతో మరోసారి ఈ జోడీని కలిపారు దర్శకనిర్మాతలు. పెళ్లి అయిన తర్వాత శ్రియ తెలుగులో నటిస్తున్న తొలిచిత్రం ఇదే.