బాబోయ్‌ ఎండలు..జాగ్రత్తలు తప్పనిసరి!

55
- Advertisement -

ప్రతి యేడాది ఎండకాలం లాంటి ఎండకాలం ఈ సారి ఉండదని వాతావరణ కేంద్ర అధికారి శ్రావణి అన్నారు. ఫిబ్రవరి నెల చివరివారం నుంచే ఎండలు మండుతాయన్నారు. ముఖ్యంగా గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల 28 నుంచి 30 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఎండలు మరింత విజృంభిస్తాయని శ్రావణి తెలిపారు.

ఈ నెల చివరి వారం నుంచి 35నుంచి 40డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏప్రిల్ మే నెలల్లో ఎండలు మరింత ముదిరి 45డిగ్రీల వరకు గరిష్టంగా పెరుగుతాయని తెలిపారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఊరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో సాధరణం కంటే 2డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్య అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఈ మేరకు ప్రజలు పలు సూచనలు పాటించాలని ముఖ్యంగా ఏవైనా పనులు ఉంటే ఉదయం, సాయంత్రం చేసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం పూట ఎక్కువగా బయట తిరగవద్దని..ఒకవేళ అత్యవసర పరిస్థితిల్లో వెళ్లితే తప్పనిసరి ద్రవ పదర్థాలను తీసుకోవాలని ఘన పదర్థాలను విలైనంత తక్కువగా తీసుకోవాలని అన్నారు. తిరిగి వడదెబ్బకు గురికావొద్దని సూచించారు. ఎక్కువగా పానీయాలను తీసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి..

గ్రీన్‌ ఇండియా…మొక్కలు నాటిన హోంమంత్రి

హెకానీ జఖాలు..నాగా చరిత్రలో తొలి మహిళ ఎమ్మెల్యే

ఉమెన్స్ డే..గ్రీన్ ఇండియా పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -