కాంగ్రెస్ పొత్తు.. ఆ పార్టీలతోనేనా?

73
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి గత కొంత కాలంగా అగమ్యగోచరంగా ఉన్న సంగతి తెలిసిందే. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఆదిపత్య విభేదాలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలే కాంగ్రెస్ ను పట్టి పీడిస్తున్నాయి. దాంతో పార్టీ కూడా గతంతో పోలిస్తే చాలా బలహీన పడిందని చెప్పక తప్పదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పిసిసిఐ పదవి చెప్పటినది మొదలుకొని ఈ రకమైన సమస్యలు పెరిగిపోయాయి. ఇదిలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి బలపరిచేందుకు హస్తం హైకమాండ్ గట్టిగానే కృషి చేస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్సస్ సీనియర్స్ ఎపిషోడ్ కు పులిస్టాప్ పెట్టినట్లే కనిపిస్తోంది.

ప్రస్తుతం బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, వి హనుమంతరావు వంటి సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి పాదయాత్రకు గట్టిగానే మద్దతు ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంచితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పొత్తు వ్యవహారం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ టీడీపీ తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే వార్తలు ఆ మద్య గట్టిగా వినిపించాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ నేత కావడం, అలాగే టీడీపీ కూడా ఈసారి తెలంగాణ ఎనికలపై గట్టిగా ఫోకస్ చేయడం మరియు ఏపీలో గత ఎన్నికల సమయంలో టీడీపీ కాంగ్రెస్ తో కలిసి నడవడం.. వంటి పరిణామాలతో టీడీపీ కాంగ్రెస్ దోస్తీ పక్కా అనే వాదనలు వినిపించాయి.

అయితే టీడీపీతో పొత్తు విషయంపై రేవంత్ రెడ్డి స్పందించారు. టీడీపీతో పొత్తు ఉండే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ బీజేపీతో కలిసేందుకు సిద్దంగా ఉందని.. బీజేపీతో కలిసి నడిచే పార్టీతో పొత్తుకు వెళ్ళేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ పొత్తు విషయంలో వామపక్షాలు మరియు తెలంగాణ జనసమితి పార్టీలతో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నట్లు రేవంత్ చెప్పుకొచ్చారు. మరి హస్తం పార్టీ కోరుకుంటున్నట్లుగా వామపక్షాలు కాంగ్రెస్ తో కలిసేందుకు మొగ్గు చూపుతయా అనేది కూడా ప్రశ్నార్థకమే. మొత్తానికి పొత్తుల విషయంలో కాంగ్రెస్ క్లారిటీగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి…

హెకానీ జఖాలు..నాగా చరిత్రలో తొలి మహిళ ఎమ్మెల్యే

175 విత్ జనసేన.. కమలం క్లారిటీ!

సుప్రీంకోర్టు..కొలిజియం తరహాలో సీఈసీ

- Advertisement -