హెకానీ జఖాలు..నాగా చరిత్రలో తొలి మహిళ ఎమ్మెల్యే

31
- Advertisement -

నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ ఎమ్మెల్యేగా గెలుపొందడం ద్వారా సరికొత్త రికార్డు లిఖించింది. దీంతో తొలిసారి నాగాలాండ్‌ అసెంబ్లీలో ఓ మహిళ ఎమ్మెల్యే కాలుమోపనున్నారు. హెకానీ జఖాలు…. నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థిగా దిమాపూర్‌-3వ స్థానం నుంచి బరిలో నిలిచి 1,536ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఎల్‌జేపీకి చెందిన అజితో జిమోమిపై ఈమె విజయం సాధించారు.

నాగాలాండ్ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పొందిన 60ఏళ్ల తర్వాత తొలిసారి హెకానీ జఖాలు ఎమ్మెల్యేగా గెలుపొందింది. ఇప్పటివరకు 13సార్లు రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు నిర్వహించారు. కానీ ఒక్కరు కూడా ఎన్నిక కాలేదు. రాష్ట్రంలో మొత్తం 13.17లక్షల ఓటర్లు ఉండగా..దాదాపు సగం 3.56లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి…

సుప్రీంకోర్టు..కొలిజియం తరహాలో సీఈసీ

అదానీ…కమిటీ వేసిన సుప్రీంకోర్టు!

పారదర్శకత కోసమే బయోమెట్రిక్ విధానం..

- Advertisement -