హెచ్‌సీఏ బరిలో అజారుద్దీన్..

147
Azharuddin

ktr

టీమిండియా మాజీ కెప్టెన్‌, హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మ‌న్ మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్ష ప‌ద‌వికి బరిలోకి దిగుతున్నాడు. ఈ మేరకు మంగ‌ళ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశాడు. అయితే అజారుద్దీన్ ఏ క్ల‌బ్ నుంచి నామినేష‌న్ దాఖ‌లు చేశాడ‌న్న విష‌యం మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు. అజ‌ర్ ఎంట్రీతో హెచ్‌సీఏ ఎన్నిక‌లు హాట్‌హాట్‌గా మారాయి. హెచ్‌సీఏను ప్ర‌క్షాళ‌న చేయ‌డానికే తాను బ‌రిలోకి దిగుతున్నాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన అజ‌ర్‌.. పూర్తిగా క్రికెట్‌కే ప్రాధాన్య‌త ఇస్తాన‌ని స్ప‌ష్టంచేశాడు. 53 ఏళ్ల ఈ క్రికెటర్‌ తాను మ‌ళ్లీ క్రికెట్ జీవితాన్ని మొద‌లుపెట్టాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపాడు. ఒకప్పుడు హెచ్ సీఏ అంటే ఎంతో గౌరవముండేదని, కానీ ఇప్పుడది లేదని అజర్ అన్నాడు. క్రికెట్ బాగుంటేనే అన్నీ బాగుంటాయని అతను అభిప్రాయపడ్డాడు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ లో తనకు ఓటు లేదని..అయినా తాను తెలంగాణ ప్రభుత్వ మద్దతును కోరతానని అజాహరుద్దీన్ అన్నారు. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సహయాన్ని తీసుకుంటానని అజాహర్ తెలిపారు.

ktr

తాను ఎక్కడికెళ్లినా హైదరాబాద్ క్రికెట్ గురించి చులకనగా మాట్లాడటం తనను బాధించిందని, హైదరాబాద్ క్రికెట్ కు పునర్ వైభవాన్ని తేవడానికే తాను అధ్యక్ష బరిలో ఉన్నట్లు అజర్ చెప్పాడు. ఈ పరిస్థితిని మార్చి ఒకప్పుడు హైదరాబాద్ ఎంతో మంది గొప్ప ప్లేయర్స్ ను అందించిందని, కానీ ఇప్పుడు మాత్రం లక్ష్మణ్ తర్వాత ఆ స్థాయి ప్లేయర్ ఎవరూ రాలేదని అజర్ అన్నాడు. 2000 ఏడాదిలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ నిషేధం ఎదుర్కొన్న అజర్.. తన వందో టెస్టుకు ఒక మ్యాచ్ దూరంలో కెరీర్ ముగించాల్సి వచ్చింది. ధోనీ, గంగూలీ కంటే ముందు టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా అజర్ కు పేరుంది.