పోస్టర్‌తోనే అదరగొట్టిన రానా…

246
rana’s underwater action
- Advertisement -

తెలుగు,తమిళ్,హిందీ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న హీరో రానా. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా…ప్రస్తుతం ఘాజీ అనే ఇంటర్నేషనల్ సినిమాలో నటిస్తున్నాడు. 1971లో జరిగిన భారత్ , పాకిస్థాన్ యుద్ధ సమయంలో సముద్ర గర్భంలో అదృశ్యమయిన సబ్ మెరైన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రానా నావెల్ ఆఫీసర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతోంది.

ఇప్పటికే టైటిల్ లోగో పాటు నావెల్ ఆఫీసర్గా రానా లుక్ను రివీల్ చేసిన చిత్రయూనిట్ తాజాగా మరో పోస్టర్ను రిలీజ్ చేసింది. రానాతో పాటు తాప్సీ, అతుల్ కులకర్ణిలు కనిపిస్తున్న ఈ పోస్టర్లో సబ్ మెరైన్ లోపలి దృశ్యాలను కూడా చూపించారు.

rana’s underwater action

సముద్రం అడుగున ఓ భారీ సబ్ మెరైన్.. ఒక పక్క నుంచి దాన్ని ట్రాన్స్ పరెంట్ గా చూపిస్తూ.. లోపల ఉన్న క్రూ.. వెనకాల మరో పెద్ద సబ్ మైరెన్.. దాని నుంచి దూసుకొస్తున్న రాకెట్ లాంఛర్స్.. మొత్తం మీద అండర్ వాటర్ థీమ్ తో అదిరిపోయే విజువల్స్ తో.. ఓ సూపర్బ్ మూవీ చూపించబోతున్నారనే విషయం అర్ధమవుతోంది.భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఘాజీ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

- Advertisement -