స్పీకర్‌..ఏకగ్రీవమే..!

148
kcr

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నేడు కొలువుదీరనుంది. నేటి నుండి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. స్పీకర్‌గా ఎవరు ఎన్నికవుతారు ? అనే ఉత్కంఠ నెలకొంది. స్పీకర్ రేసులో పోచారం,ఈటల రాజేందర్ పేర్లు పరిశీలనకు రాగా పోచారం పేరునే సీఎం కేసీఆర్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. పీసీసీ అధ్యక్షుడు
ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. బీజేపీ, ఎంఐఎం కేసీఆర్ ప్రతిపాదనకు వెంటనే అంగీకారం తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ తమ నిర్ణయాన్ని ప్రకటించనుంది.

ముందుగా సీఎం కేసీఆర్‌ ప్రమాణం చేస్తారు. తర్వాత మహిళా సభ్యుల ప్రమాణం జరుగుతుంది. అక్షర క్రమంలో మొదటగా ఉన్నా ఖానాపూర్‌ నియోజకవర్గ శాసన సభ్యురాలు అజ్మీరా రేఖానాయక్‌ (ఖానాపూర్‌) చివరగా వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు.

ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ఖాన్.
జనవరి 17న ఉదయం 11.30గంటలకు అసెంబ్లీ.
కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం.
స్పీకర్ ఎన్నికకు నామినేషన్ విడుదల.
జనవరి 18న స్పీకర్ ఎన్నిక.
జనవరి 19న ఉదయం 11.30 గంటలకు మండలి సమావేశం.
జనవరి 19న ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.