మహానాయకుడికి బ్రేక్ పడింది..!

151
ntr biopic

సంక్రాంతి పర్వదినం సందర్భంగా.. మూడు భారీ సినిమాలు సినీ అభిమానుల ముందుకు వచ్చాయి. అందులో మొదటగా వచ్చిన మూవీ బాలకృష్ణ- క్రిష్ కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్-కథానాయకుడు’. పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకున్న ఈ చిత్రం వసూళ్లలో మాత్రం జోరును కంటిన్యూ చేయలేదు.

తాజాగా బాక్సాఫీసు వద్ద తొలివారం పూర్తి చేసుకున్న ఈ మూవీ బిజినెస్ పరంగా చాలా వెనకపడింది. పండగ సీజన్ అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ఫ్లో ఈ సినిమా వైపు లేకపోవడం గమనార్హం. తొలివారం ఈ చిత్రం రూ. 33.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో రూ. 18.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సెకండ్‌ పార్టును వాయిదా వేసేందుకు సిద్ధమైందట చిత్రయూనిట్. ఫిబ్రవరి 7న సినిమా విడుదల కావాల్సి ఉండగా కథనాయకుడు తెచ్చిన అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని చిత్రం క్వాలిటీ పట్ల మరింత కేర్ తీసుకోవాలని భావిస్తున్నారట. సో మహానాయకుడు చూడాలంటే మరిన్ని రోజులు వేచిచూడాల్సిందే.