పెళ్లి పీటలెక్కనున్న మిర్చి బ్యూటీ..!

162
Richa Gangopadhyaya

తెలుగుతో పాటు తమిళం, బెంగాళీ మూవీల్లోనూ నటించి మెప్పించిన బ్యూటీ రిచా గంగోపాధ్యాయ. అయితే సెకండ్ హీరోయిన్‌గా ముద్రపడటం, ఆఫర్లు తగ్గడంతో సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ ఇకపై తాను సినిమాల్లోకి మళ్లీ రానని, కేవలం వ్యక్తిగత జీవితంపైనే దృష్టి సారించినట్లు తెలిపింది.

తాజాగా తాను త్వరలోనే పెళ్లిచేసుకోనున్నట్లు తెలిపి బాంబు పేల్చింది. తన బాయ్ ఫ్రెండ్ జోయ్ అనే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ జరిగినట్టుగా ప్రకటించింది ఈ ఢిల్లీ బ్యూటీ. రెండేళ్ల‌ క్రితం జోయ్‌, నేను బిజినెస్ స్కూల్‌ లో క‌లిశాం. నా జీవితంలో త‌ర్వాతి ద‌శ గురించి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా. పెళ్లి ముహూర్తం ఇంకా ఖ‌రారు చేయ‌లేదు అని రిచా ట్వీట్ చేసింది.

2010లో హీరో రానా నటించిన లీడర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రిచా.. సైమా వేడుకల్లో ఉత్తమ నటిగా (క్రిటిక్స్‌ ఛాయిస్‌) అవార్డును అందుకుంది. మిరపకాయ్‌, మిర్చి సినిమాలతో ప్రేక్షకులను ఫిదా చేసింది.