ఆదేశాల నుండి విమానాలను ఆపండి: కేజ్రీవాల్

41
kejriwal

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ఆ వేరియంట్ భారత్‌లోకి రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఆయా దేశాల నుండి తక్షణమే విమానాల రాకపోకలను నిలిపివేయాలని కోరారు.

నూతన వేరియంట్ ఒమిక్రాన్‌ నమోదైన దేశాల నుంచి విమానాలను నిలిపివేయాలని సూచించారు. అతి కష్టం మీద దేశం కరోనా నుండి కోలుకుంది..ఈ కొత్త వేరియంట్‌ను భారత్‌లోకి రాకుండా నిరోధించేందుకు మనం అన్ని విధాలా కృషి చేయాలని తెలిపారు. దేశంలో కరోనా పరిస్ధితులు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని కీలక భేటీ జరపున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా పలు సూచనలు చేశారు.