కరోనాలో మరో కొత్త వేరియంట్​..

218
covid
- Advertisement -

ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. భారత్‌లో సైతం కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో థర్డ్ వేవ్ వస్తుందన్న సంకేతాలు వస్తుండగా తాజాగా మరో వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్ కన్నా వేగంగా సోకుతూ టెన్షన్ పెడుతోంది.

ఆ కొత్త మ్యుటేషన్ పేరు ఐహెచ్ యూ (బీ.1.640.2). ఫ్రాన్స్ లోని ఐహెచ్ యూ మెడిటరనీ ఇన్ ఫెక్షన్ కు చెందిన సైంటిస్టులు ఈ కొత్త మ్యుటేషన్ ను గుర్తించారు. ఆ సంస్థ పేరునే వేరియంట్ కూ పెట్టారు. ప్రస్తుతం మార్సెయ్ అనే సిటీలో 12 కేసులను నిర్ధారించారు. వారంతా కూడా ఆఫ్రికా దేశమైన కామెరూన్ నుంచి వచ్చారని తేల్చారు.

ఇక భారత్‌లో కరోనా,ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించగా ఢిల్లీలో వీకెండ్ లాక్ డౌన్ విధించారు.

- Advertisement -