అర్జున్ రెడ్డి భామకు ఏమైంది…..!

273
Arjun Reddy Shalini unwell
- Advertisement -

విడుదలకు ముందు వివాదాస్పదంగా మారిన అర్జున్ రెడ్డి తర్వాత మాత్రం కలక్షన్స్ తో సత్తా చాటింది. ప్రేక్షకుల ఆదరణతో అన్నిసెంటర్లలో మంచి వసూళ్లను రాబట్టింది.  ఈ మూవీలో హీరోగా చేసిన విజయ్ దేవరకొండ, హీరోయిన్‌ షాలిని ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఈ ఇద్దరు ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

ఓ వైపు సినిమా ఆఫర్ల బిజీగా ఉన్న షాలిని  ఓ మొబైల్ షోరూమ్ ఓపెనింగ్ కోసం ఏపీలోని నెల్లూరుకి వెళ్లింది.  షాపు ఓపెనింగ్ లోకి పాల్గొన్న తర్వాత  లైవ్ మ్యూజిక్ పేరుతో చిన్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో హీరోయిన్ షాలినీ అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయింది. షాపు యాజమాన్యం వెంటనే బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో స్ట్రైచర్ పై తీసుకెళ్లే సమయంలో శరీరంపై తెల్లటి వస్త్రం కప్పి ఉంచారు. ముఖం కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రెండు గంటల చికిత్స, అబ్జర్వేషన్ తర్వాత డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు.

ప్రస్తుతం షాలిని…సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి సినిమాతో పాటు 100% లవ్ రీమేక్‌లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. తొలుత ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్యత్రిపాఠిని అనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల ఆమె ప్లేస్ లో షాలిని పాండేని తీసుకున్నారు.

- Advertisement -