రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రాజమౌళి మహేశ్ పాస్‌పోర్ట్‌ని లాక్కొని ఎటు వెళ్లకుండా చేసినట్లు ఒక వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా నా పాస్‌పోర్ట్ నాకు వచ్చినట్లు ఒక వీడియోను విడుదల చేశాడు మహేష్ బాబు. అంటే సినిమా షూటింగ్‌లో కాస్త బ్రేక్ దొరకడంతో వెకేషన్‌కి వెళ్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
మహేష్ బాబు సరసన ప్రియంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.
— oærmy (@ssmbbakthudu) April 5, 2025
Also Read:TTD:తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు ప్రత్యేక పోర్టల్

