కుప్పంలో టీడీపీకి షాకిచ్చిన వైసీపీ…!

51
chandrababu

ఏపీలో టీడీపీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. స్ధానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించగా టీడీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. ఇక టీడీపీ అధినేత, చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ టీడీపీకి పరాభవం తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ తగ్గడంతోనే చంద్రబాబుకు షాక్‌కు తగలగా తాజాగా స్ధానిక సంస్థల ఎన్నికల్లో కోలుకోలేని షాక్‌ ఇచ్చారు కుప్పం ప్రజలు.

కుప్పం నియోజక వర్గంలో మొత్తం 89 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, 74 చోట్ల వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ 14 చోట్ల, కాంగ్రెస్ ఒకచోట విజయం సాధించింది. ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 264 పంచాయతీల్లో ఎన్నికలు జరుగగా ఏకగ్రీవాలు 91, వైసీపీ 145, టీడీపీ 28, కాంగ్రెస్ ఒకచోట విజయం సాధించింది.

1985 నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది కుప్పం నియోజకవర్గం. 1989 నుండి చంద్రబాబు ఇక్కడి నుండి గెలుస్తు వస్తుండగా మూడుసార్లు సీఎంగా పదవి చేపట్టారు.