హైకోర్టులో ఏపీ సీఎం జగన్‌కు ఊరట!

44
jagan

ఏపీ స్ధానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ని రద్దు చేసింది హైకోర్టు. ఏపీ ఎన్నికల సంఘానికి షాకిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది న్యాయస్ధానం. కరోనా వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డొస్తుందని అభిప్రాయపడిన హైకోర్టు…. ప్రజారోగ్యం దృష్ట్యా ఎస్‌ఈసీ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొంది.

ఆర్టికల్ 14,ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కాపాడాలన్న ప్రభుత్వం వాదనలతో హైకోర్టు పూర్తిగా ఏకీభవించింది. ప్రభుత్వ సూచనలను ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని తెలిపిన న్యాయస్ధానం….ప్రజలకు ఉన్న హక్కులను కాలరాయలేం అని తెలిపింది. దీంతో ఎస్‌ఈసీకి షాక్ తగిలింది.