వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమా..?:బండికి కడియం సవాల్

58
kadiyam

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై తనదైన శైలీలో విమర్శలు గుప్పించారు మాజీ డిప్యూటీ సీఎం,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. టీఆర్ఎస్ నేతలు టూత్ బ్రష్ గాళ్లు అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన కడియం… మేము టూత్ బ్రష్ గాళ్లమైతే మీరు బూటు పాలిష్ గాళ్లా అని ఎద్దేవా చేశారు.

స్మార్ట్ సిటీ నిధుల్లో అవినీతి జరగలేదని.. భద్రకాళీ టెంపుల్ ఎందుకు.. ప్రెస్‌క్లబ్‌లో చర్చిద్దాం రావాలని సవాల్ విసిరారు. తన ఛాలెంజ్ స్వీకరించేందుకు సిద్దమా అంటూ బండిని కడియం ప్రశ్నించారు.

దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుతో వీర్రవీగొద్దని.. అయినా బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య సింగిల్ డిజిట్ దాటలేదన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలంటూ కడియం విరుచుకుపడ్డారు. భద్రకాళీ, భాగ్యలక్షీ ఆలయాల్లో రాజకీయాలు ఎందుకని ప్రశ్నించిన కడియం…. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని తేల్చిచెప్పారు.