మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..

43

ఏపీలో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు భయపెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 62 వేల 857 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 1,439 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 261 కేసులు.. కర్నూలు, విజయనగం జిల్లాలలో అత్యల్పంగా 8 కేసుల చొప్పున నమోదయ్యాయి.

ఇదే సమయంలో 14 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 1,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,26,042కి చేరుకుంది. ఇప్పటి వరకు 19,97,454 మంది కోలుకున్నారు. అలాగే ఇంతవరకు 13,964 మంది కరోనా వల్ల చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,624 యాక్టివ్ కేసులు ఉన్నాయి.