దేశంలో కొత్త‌గా 6,987 క‌రోనా కేసులు..

70

దేశంలో క‌రోనా కేసులు, మృతుల సంఖ్య‌పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వివ‌రాలు తెలిపింది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 422కి చేరింద‌ని పేర్కొంది. వారిలో 130 మంది కోలుకున్నార‌ని తెలిపింది. దేశంలో కొత్త‌గా మొత్తం 6,987 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని వివ‌రించింది.

అలాగే, నిన్న క‌రోనా నుంచి 7,091 మంది కోలుకున్నారు. 162 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 76,766 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం 3,42,30,354 మంది కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల మొత్తం 4,79,682 మంది ప్రాణాలు కోల్పోయారు.