ఏపీలో కొత్తగా 2,237 పాజిటివ్ కేసులు..

31
corona

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 76,663 కరోనా టెస్టులు నిర్వహించారు. కొత్తగా 2,237 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 379 కేసులు వచ్చాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 24 పాజిటివ్ కేసులు గుర్తించారు. ప్రకాశం (83), కడప (84), విజయనగరం (87), నెల్లూరు (88) జిల్లాల్లో రెండంకెల్లోనే కేసులు వచ్చాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 12 మంది మృతి చెందారు. తాజాగా 2,256 మంది ఆరోగ్యవంతులయ్యారు.

ఏపీలో ఓవరాల్ గణాంకాలు చూస్తే… ఇప్పటివరకు 8,42,967 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,14,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 21,403 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 6,791కి చేరింది.