టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై మరో కేసు

390
raviprakash
- Advertisement -

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న రవిప్రకాశ్ పై మరో కేసు నమోదైంది. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేయడంతో 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు సీసీఎస్ పోలీసులు. ఇప్పటికే రవిప్రకాష్ పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి.

నిధుల గోల్మాల్ సంబంధించి ఒక కేసు నమోదు కాగా టీవీ9 లో ఫండ్‌ను అనధికారికంగా తరలించారన్న ఆరోపణలపై రవి ప్రకాష్‌పై మరో కేసు నమోదైంది. చంచల్ గూడ జైల్లో రిమాండ్ గా ఉన్న రవిప్రకాశ్ ను పిటీ వారెంట్ తో మియాపూర్ కోర్టుకు తరలించారు. రవి ప్రకాశ్ కు సంబంధించిన యూట్యూబ్ ఛానెళ్లలో తనపై అస్యత వార్తలు రాస్తున్నారంటూ హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్ మీడియా హౌస్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -