వరి-పత్తి మద్దతు ధరను ప్రకటించిన హరీష్‌ రావు..

413
harish rao
- Advertisement -

గురువారం సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావు పత్తి మార్కెట్ యార్డులో వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అలాగే వరి,పత్తి పంటలకు మద్ధతు ధరను ప్రకటించారు. వరి ధాన్యానికి రూ. 1835, పత్తికి రూ. 5550 మద్దతు ధరను నిర్ణయించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఈ సారి 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. 2.25 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి వస్తుందని అంచనా వేస్తున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 169 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పత్తి కొనుగోలు కోసం 32 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

గతంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలు యథావిధిగా పని చేస్తాయి. సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. రైతులకు నష్టం జరగకుండా ధాన్యం కొనుగోలు కోసం సీఎం కేసీఆర్‌ రూ. 7 వేల కోట్లు కేటాయించారని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

- Advertisement -