రవిప్రకాశ్, శివాజిల అరెస్ట్ కు రంగం సిద్దం…అన్ని ఎయిర్ పోర్ట్ లలో హై అలర్ట్

223
TV9-Ravi-Prakash-Hero-Sivaji

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీ ల గురించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. కోర్టులో విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రవి ప్రకాష్, శివాజీలపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. నిన్న రాత్రి వారిద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ప్రస్తుతం తాము చాలా ఇబ్బందుల్లో ఉన్నామని..ఇప్పుడున్న పరిస్ధితుల్లో తాము కోర్టుకు హాజరుకాలేమని ఈమెయిల్ ద్వారా కోర్టుకు తెలిపారు రవిప్రకాశ్, శివాజి. రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

ఇందుకోసం రెండు బృందాలుగా విడిపోయి వేట కొనసాగిస్తున్నారు. ఇక తాజాగా ఉన్న సమాచారం మేరకు రవిప్రకాశ్ ఏపీలో ఉన్నట్లు తెలుస్తుంది. పలువురు రాజకీయ నాయకులు ఆయనకు ఆశ్రయం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ మధ్య షేర్ల కొనుగోలు ఒప్పందం నకిలీదని నిరూపించే కొన్ని ఆధారాలను సేకరించిన సైబర్‌క్రైం పోలీసులు మరిన్ని సాంకేతిక ఆధారాల కోసం పరిశిలిస్తున్నారు. రవిప్రకాష్, శివాజీ దేశం విడిచిపారిపోయే ఛాన్స్ ఉందని అనుమానిస్తున్నారు పోలీసులు .

ఇప్పటికే వీరి పాస్ పోర్ట్స్ పై అధికారులతో మాట్లాడారు. వీరిద్దరూ కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేయాలని దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలర్ట్ చేశారు. ఆయా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపడుతున్నారు. రవిప్రకాశ్, శివాజి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పలు కీలక డ్యాకుమెంట్లను స్వాధినం చేసుకున్నారు. రవి ప్రకాశ్, శివాజిల కేసు ఎంతదూరం వెళ్తుందో చూడాలి మరి.