అమెరికాకు నటుడు శివాజీ…అరెస్ట్ చేసిన పోలీసులు

542
Shivaji Arrest
- Advertisement -

ప్రముఖ నటుడు శివాజీని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. టీవీ9 వాటాల వివాదంలో శివాజీ గత కొద్ది రోజులుగా అజ్నాతంలో ఉన్న సంగతి తెలిసిందే. శివాజీ పై కొద్ది రోజుల క్రితం అలంద మీడియా సంస్ధ కేసు పెట్టగా అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు.

ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు పారిపోయేందుకు శివాజీ యత్నించగా, సైబరాబాద్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

అనంతరం సైబరాబాద్ సైబర్ క్రైం పీఎస్‌కు శివాజీని తరలించారు. శివాజీకి పలుమార్లు నోటిసులు ఇచ్చిన స్పందించకపోవడంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. ఇమ్మిగ్రేషన్ అధికారుల చొరవతో శివాజీని పట్టుకున్నామని తెలిపారు.

- Advertisement -