జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 3వేల పెన్షన్‌:అల్లం

133
allam narayana

జర్నలిస్టు సంఘం స్ధాపనకు పనిచేసిన వారిలో టీ న్యూస్ జర్నలిస్టు,దివంగత ప్రకాశ్‌ చేసిన సేవలు మరువలేనివన్నారు మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిర్వహించిన ప్రకాశ్ సంతాప సభలో మాట్లాడిన అల్లం నారాయణ…రాష్ట్రంలో ఆరు వంద‌ల‌పైచిలుకు జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా వ‌చ్చింద‌ని, ప్ర‌తి ఒక్క‌రికి రూ.20 వేల చొప్పున ఆర్థిక స‌హాయం అందించామ‌ని తెలిపారు.

రూ.34 కోట్ల జ‌ర్న‌లిస్టుల నిధి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్ల‌డించారు. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు రూ.3 వేల పెన్ష‌న్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.వీడియో జ‌ర్న‌లిస్ట్ సంఘం స్థాప‌న‌కు ప‌నిచేసిన‌వారిలో ప్ర‌కాశ్ కూడా ఉన్నార‌ని తెలిపారు. ఆయ‌న కుటుంబానికి మీడియా అకాడ‌మీ అండ‌గా ఉంటుంద‌ని చెప్పారు.